Site icon HashtagU Telugu

Krishnam Vande Jagadgurum : ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ టైటిల్ సాంగ్ రాయడానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా..? మొదట సాంగ్ లెంగ్త్..

Krishnam Vande Jagadgurum Title Song Back Story

Krishnam Vande Jagadgurum Title Song Back Story

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో రానా(Rana), నయనతార(Nayanthara) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. గమ్యం’, ‘వేదం’ వంటి సినిమాల తరువాత క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఆ సమయంలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ సమయానికి ఆ అంచనాలు మరింత పెరగడానికి ఒక సాంగ్ కారణమైంది. మత్య్స, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల గురించి ఒక్క పాటలో చెప్పాలని క్రిష్ భావించాడు. ఇంకేముంది తన గురువుగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ విషయం చెప్పాడు.

సీతారామశాస్త్రి ఈ పాటని ఒక ఛాలెంజ్, ఆయనకి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి.. తన కలంతో అద్భుతం సృష్టించారు. దాదాపు రెండున్నర నెలలు పాటు ఈ పాట కోసం కష్టపడ్డారట. దశావతారాలు గురించి ఎంతో రీసెర్చ్‌ చేసి కృష్ణం వందే జగద్గురుమ్‌ సాంగ్ ని రచించారు. ఇక ఈ పాటకి స్వరబ్రహ్మ మణిశర్మ ఇచ్చిన సంగీతం మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇక ఈ భాగవతలీలలను బాలసుబ్రమణ్య గానంతో వింటుంటే.. ఆడియన్స్ కి కళ్ళ ముందే మహాభాగవతం కనిపించింది.

అయితే ఈ పాటని మొదట రికార్డు చేసినప్పుడు 15 నిమిషాలు వచ్చిందట. ఆ తరువాత దానిని 12 నిమిషాలకు కుదించారు. అయితే క్రిష్ దానిని ఇంకా తగ్గించాడు. పాట అంత సమయం ఉంటే ప్రేక్షకులు ఆస్వాదించలేరేమోనన్న సందేహంతో 9 నిమిషాల 20 సెకన్లకు ఆ పాటని క్రిష్‌ తగ్గించాడు. ఇక ఈ పాటలో, సినిమాలో రానా చేసిన నటన కూడా ఆడియన్స్ ని బాగా అక్కట్టుకుంది. ఇప్పటికి చాలా ఈవెంట్స్ లో ఈ పాటని ప్రదర్శించడం ఒక ఛాలెంజ్ తీసుకుంటుంటారు నృత్య కళాకారులు.