Site icon HashtagU Telugu

Kannappa: కన్నప్ప మూవీ బాబే చేయాలి.. బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్లు 2 వేల కోట్లు.. కృష్ణంరాజు కామెంట్స్ వైరల్!

Kannappa

Kannappa

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వాటిలో భక్తకన్నప్ప మూవీ కూడా ఒకటి. ఈ సినిమా కృష్ణంరాజు కెరియర్ లోనే ఆల్ టైం క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో శివ భక్తుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో 1976లో ఈ సినిమా విడుదల అయి సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా వాణిశ్రీ నటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కన్నప్ప సీక్వెల్లో ప్రభాస్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాకుండా అంత మంచి సినిమాకు సీక్వెల్ రావాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటారు. ప్రభాస్ కన్నప్పగా నటించాలని చాలా మంది కోరుకున్నారు. స్వయంగా కృష్ణంరాజు కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో సీక్వెల్ చేయాలని భావించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆలోచన వద్దే ఆగిపోయింది. భక్తకన్నప్ప సీక్వెల్ గురించి కృష్ణంరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కన్నప్ప చిత్రానికి సీక్వెల్ చేస్తే బాబే చేయాలి అని అన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో కన్నప్ప చేసే ఆలోచన కూడా ఉందని అప్పట్లో కృష్ణంరాజు తెలిపారు.

కానీ అనుకోకుండా కృష్ణంరాజు నిర్మాణ భాగస్వామ్యంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించారు. కన్నప్ప చిత్రంలో ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ చేయాల్సిన చిత్రాన్ని విష్ణు చేస్తున్నాడు అని మోహన్ బాబు ఇటీవల తెలిపారు. కానీ కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ లో రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కనుక కన్నప్ప చిత్రంలో నటించి ఉంటే కృష్ణంరాజు ఈ చిత్రానికి 500 కోట్ల బడ్జెట్ పెట్టేవారు అని, వసూళ్లు 2000 కోట్ల వరకు ఉండేవి అని ప్రభాస్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. కన్నప్పగా మంచు విష్ణు, 140 కోట్ల బడ్జెట్ మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని సొంత నిర్మాణంలో రూపొందిస్తున్నారు. 140 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ లాల్ మరో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివ పార్వతులుగా కనిపిస్తున్నారు.