Site icon HashtagU Telugu

Nagarjuna : నాగార్జునకి యాక్షన్ సినిమా కథ చెప్పి.. ఫ్యామిలీ మూవీ తీసిన కృష్ణవంశీ.. ఆర్జీవీ వల్లే..

Krishna vamsi wants to do action movie with nagarjuna but story change in last moment because of RGV

Krishna vamsi wants to do action movie with nagarjuna but story change in last moment because of RGV

టాలీవుడ్(Tollywood) లో క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi). రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దగ్గర వర్క్ చేసిన కృష్ణవంశీ.. 1995లో ‘గులాబీ'(Gulabi) అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నాడు. దీంతో స్టార్ హీరో అయిన నాగార్జున(Nagarjuna) పిలిచి మరి కృష్ణవంశీకి అవకాశం ఇచ్చాడు. ఇక ఛాన్స్ తో కృష్ణవంశీ కూడా ఒక మాస్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసి నాగార్జునకి వినిపించాడు. స్టోరీ నచ్చడం, ఒకే చెప్పేయడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో భాగంగా లొకేషన్స్ వెతకడానికి కృష్ణవంశీ విశాఖపట్నం వెళ్లడం జరిగింది.

అయితే కథ అంతా ఇక్కడే మారిపోయింది. విశాఖపట్నంలో కృష్ణవంశీని ఒక వ్యక్తి గుర్తుపట్టి.. “మీ గురువు రామ్ గోపాల్ వర్మలా గులాబీ సినిమా బాగా చేశారు” అని ప్రశంసించాడు. ఇక ఆ మాటలు విన్న కృష్ణవంశీకి ఒక విషయం అర్థమైంది. తాను ఏ యాక్షన్ మూవీ చేసిన వర్మ అనే ముద్ర పడుతుంది. ఇక నుంచి వర్మ మార్క్ తన పై పడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో వెంటనే నాగార్జునకి ఫోన్ చేసి.. ‘నేను మీకు చెప్పిన కథతో సినిమా చేయడం లేదు’ అని చెప్పాడు. దానికి నాగార్జున.. ‘నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా?’ అని అడిగాడట. ‘నేను మిమ్మల్ని కలిసి మాట్లాడతాను’ అని చెప్పి కృష్ణవంశీ ఫోన్ పెట్టేశాడు.

ఇక ఆ టైంలో బాలీవుడ్ లో ‘దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే’ వంటి కుటుంబ కథ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ కథ స్ఫూర్తితో ‘నిన్నే పెళ్లాడతా’ కథని రాసుకున్నాడు. మరుసటి రోజు ఆ కథని నాగార్జునకు చెప్పి ఒప్పించాడు. టబు హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటి జనరేషన్ వాళ్ళని కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. సందీప్‌ చౌతా ఇచ్చిన పాటలు అయితే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అంతేకాదు నేషనల్ అవార్డు కూడా అందుకొని సంచలనం సృష్టించింది నిన్నే పెళ్లాడతా సినిమా. ఈ సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న రోల్ కూడా చేశాడు రవితేజ.