Krishna Vamsi : నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ ‘పవన్ కల్యాణే’ – డైరెక్టర్ కృష్ణవంశీ

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని , అవినీతిమయంగా మారిన రాజకీయాలలో ఓ వ్యక్తి విలువలు

Published By: HashtagU Telugu Desk
Krishnavamshi Pawan

Krishnavamshi Pawan

తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Deeksha) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక లడ్డు విషయంలోనే కాదు హిందూ దేవుళ్ల పై కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడిన , సెటైర్లు వేసిన , సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిత్రసీమ ప్రముఖలు సైతం వార్నింగ్ ఇచ్చాడు. పవన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సపోర్ట్ చేస్తుంటే..మరికొంతమంది నిందలు వేస్తున్నారు.

ఈ క్రమంలో డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ..పవన్ కళ్యాణ్ ను ..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తో పోల్చాడు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని , అవినీతిమయంగా మారిన రాజకీయాలలో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడని, భగవంతుడు ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కృష్ణవంశీ వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లకు బలంగా సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకుడు సౌత్ లో వచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అభిమానులు , జనసేన శ్రేణులు కృష్ణవంశీ కి థాంక్స్ చెపుతూ పాజిటివ్ కామెన్స్ వేస్తున్నారు.

Read Also : Devara Ayudha Pooja Song : దేవర ఆయుధ పూజ సాంగ్ వచ్చేసింది

  Last Updated: 26 Sep 2024, 07:38 PM IST