Site icon HashtagU Telugu

Anthahpuram : ఇదెక్కడి ట్విస్ట్‌రా బాబు.. సౌందర్య ‘అసలేం గుర్తుకురాదు’ పాటలోని..

Krishna Vamsi, Anthahpuram, Soundarya, Asalem Gurthukuradhu Song

Krishna Vamsi, Anthahpuram, Soundarya, Asalem Gurthukuradhu Song

Anthahpuram : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై ఒక చెరగని ముద్రని వేసుకున్నాయి. వాటిలో ప్రథమంది అంటే.. అంతఃపురం అనే చెప్పాలి. ఫ్యాక్షన్ కథకి ఎమోషనల్ డ్రామాని జత చేసి కృష్ణవంశీ చూపించిన విధానం ఆడియన్స్ తో పాటు మూవీ మేకర్స్ ని కూడా అబ్బురపరిచింది. ఇక క్రియేటివ్ పాయింట్ ని చూసిన బాలీవుడ్ మేకర్స్ సైతం.. అక్కడి యాక్టర్స్ తో హిందీలో రీమేక్ చేసారు. ఆ సినిమాని కూడా కృష్ణవంశీనే డైరెక్ట్ చేసారు.

తెలుగు సినిమాలో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ అద్భుత సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. మూవీలోని ప్రతి పాట కథలో భాగంగా సాగుతూ.. ఆడియన్స్ ని కథలో లీనం అయ్యేలా చేసింది. ఇక ‘అసలేం గుర్తుకురాదు’ సాంగ్ అయితే.. ప్రేమ పాటల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఇప్పటికి ఎంతోమంది మ్యూజిక్ ప్లే లిస్టులో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.

ఇక ఈ పాట వింటున్న ప్రతిసారి, ఆడియన్స్ కి ఒకటే గుర్తుకు వస్తుంది. అదేంటంటే, ఈ పాటలో సౌందర్య ధరించిన చీర రంగులు మారుతూ ఉంటుంది. ఈ విషయం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ విషయం గురించి ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. ”అంతఃపురం ‘అసలేం గుర్తుకురాదు’ పాటలో సౌందర్య గారి చీర రంగులు మారడం భలే అనిపించింది. కొత్తగా ఉంది అప్పట్లో. ఆ ఐడియా ఎలా వచ్చింది సార్” అంటూ కృష్ణవంశీని ప్రశ్నించాడు.

ఈ ట్వీట్ కి కృష్ణవంశీ రియాక్ట్ అవుతూ.. ”సినిమాలో ఉన్న పాటలో అలా రంగులు మారడం అనేది లేదు. జెమినీ టీవీలో ప్రసారం చేసేటప్పుడు, ఆ ఛానల్ ఎడిటర్ అలా రంగులు మారుస్తూ పాటని టెలికాస్ట్ చేసాడని” చెప్పుకొచ్చారు. ఇక ఇన్నాళ్ల తరువాత ఇది తెలుసుకున్న కొందరు ఆడియన్స్.. ఇదెక్కడి ట్విస్ట్ అంది బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.