Site icon HashtagU Telugu

Rebel Star : ఆ కోరిక తీరకుండానే….కన్నుమూసిన కృష్ణంరాజు..!!

Krishnam Raju Imresizer

Krishnam Raju Imresizer

ప్రముఖ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో తనువు చాలించారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా కృష్ణంరాజు చిరకాల కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ అంటే ఆయన ఎంతో ఇష్టం. ప్రభాస్ ను కృష్ణంరాజే సినిమాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారు. వెనకుండి నడిపిస్తూ ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ చేశారు.

ప్రభాస్ కు కూడా తన పెదనాన్న అంటే ఎంతో ఇష్టం. చిన్ననాటి నుంచి పెదనాన్నను చూస్తూ పెరిగానని ఎన్నో సందర్భాల్లో చెప్పేవాడు. ఇక కృష్ణంరాజు ఎప్పుడూ కూడా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడేవారు. ప్రభాస్ కు మంచి అమ్మాయిని వెతుకుతున్నామని..త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెబుతుండేవారు. ఒక సందర్భంలో ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలన్న కోరిక ఉందని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ పెళ్లి చూడకుండానే…తన చిరకాల కోరిక తీరకుండానే మరణించారు రెబల్ స్టార్ .