Chiranjeevi : చిరంజీవి సినిమా ఓపెనింగ్‌కి ముగ్గురు స్టార్ హీరోలు.. బాలకృష్ణ పుట్టినరోజున రిలీజ్..

ఒకసారి చిరంజీవి(Chiranjeevi) మూవీ ఓపెనింగ్ కి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు వచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Krishna Krishnam Raju and Sobhhan Babu as guests for Chiranjeevi Khaidi Number 786 Movie opening

Krishna Krishnam Raju and Sobhhan Babu as guests for Chiranjeevi Khaidi Number 786 Movie opening

ఒక స్టార్ సినిమా ఫంక్షన్ మరో స్టార్ హీరో రావడం చాలా పెద్ద విషయం. ఒకే స్టేజి పై తమ హీరోతో కలిసి మరో హీరో కనిపిస్తే వారి అభిమానుల్లో ఎంతో సంతోష పడుతుంటారు. అలా ఒకసారి చిరంజీవి(Chiranjeevi) మూవీ ఓపెనింగ్ కి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు వచ్చారు. చిరంజీవి అండ్ డైరెక్టర్ విజయ బాపినీడు(Director Vijaya Bapineedu) కలయికలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ లిస్ట్ లో మాస్ బ్లాక్ బస్టర్ ‘గ్యాంగ్ లీడర్'(Gang Leader) కూడా ఉంది. కాగా వీరిద్దరి కలయికలోనే తెరకెక్కిన మరో సినిమా ‘ఖైదీ నంబర్ 786’(Khaidi Number 786).

1987 అక్టోబర్‌ 25న ఈ మూవీ ఓపెనింగ్ వాహినీ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ(Krishna), సోగ్గాడు శోభన్ బాబు(Sobhan Babu), రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju) వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, హీరోయిన్ భానుప్రియపై ముహూర్తపు షాట్‌ ని చిత్రీకరించగా కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. శోభన్‌బాబు క్లాప్ కొట్టగా కృష్ణంరాజు కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ఆ తరువాత ఈ ముగ్గురు హీరోలతో కలిసి చిరంజీవి పేపర్ ఫోటోకి స్టిల్స్ ఇచ్చారు. అలా నలుగురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అభిమానులకు సంతోషాన్ని కలుగజేసింది.

ఇక ఈ సినిమా 1988 నందమూరి బాలకృష్ణ బర్త్ డే నాడు జూన్ 10న రిలీజ్ కావడం గమనార్హం. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా శత దినోత్సవాన్ని కూడా జరుపుంది. ఇక శత దినోత్సవాన్ని కొత్తగా నిర్వహించారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటాయో. అలా ఉదయం, సాయంత్రం శత దినోత్సవం వేడుకలు జరిపి తన ప్రత్యేకతను చాటుకున్నారు దర్శకుడు బాపినీడు.

 

Also Read : Ravi Kishan Daughter: సైన్యంలో చేరిన ‘రేసుగుర్రం’ విలన్ కుమార్తె.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న నెటిజ‌న్లు

  Last Updated: 28 Jun 2023, 09:03 PM IST