Site icon HashtagU Telugu

Krishna : ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్‌లో.. కృష్ణకి ఎవరు ఇష్టమో తెలుసా?

Krishna favorite hero in present generation

Krishna favorite hero in present generation

టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్(NTR), ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్(Ram Charan).. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్స్ అయ్యిపోయారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ముందుగా పాన్ ఇండియా ఇమేజ్ ని సొంత చేసుకుంటే.. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR సినిమాతో ఏకంగా గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప లాంటి రీజినల్ సినిమాతో పాన్ ఇండియా హిట్టుని అందుకొని రియల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ మేకర్స్ సైతం ఈ నలుగురు హీరోల డేట్ లు కోసం ఎదురు చూస్తున్నారు.

వీరంతా.. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో నేడు హాలీవుడ్ సినిమాలకు తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. అయితే ఒకప్పుడే తన డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసిన హీరో కృష్ణ. కౌ బాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలను టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం చేసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చారు. అయితే కృష్ణకి మహేష్ బాబు కాకుండా ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా? ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృష్ణని ప్రశ్నించారు.

మహేష్ కాకుండా ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లో ఏ హీరో అంటే ఇష్టమని కృష్ణని గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకి ఇష్టమని, అతని యాక్టింగ్ నచ్చుతుందని సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పేశారు. కాగా ఎన్టీఆర్ అండ్ మహేష్ బాబు ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. మహేష్ ని ‘అన్న’ అంటూ ఎన్టీఆర్ ఆప్యాయంగా పిలుస్తాడని గతంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే తెలిపాడు. ఇక త్వరలో మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో గ్లోబల్ రీచ్ పాపులారిటీని అందుకోవడానికి సిద్దమవుతున్నాడు. హాలీవుడ్ మేకర్స్ తో కలిసి రాజమౌళి SSMB29 చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ స్టోరీగా ఈ మూవీ ఉండబోతుందని జక్కన్న చెప్పుకొస్తున్నాడు.

 

Also Read : Nenu Student Sir Review: ఈ స్టూడెంట్ ప్రేక్షకులను మెప్పించాడా!