లిరిసిస్ట్ కృష్ణ చైతన్య తన డైరెక్షన్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నితిన్ తో ఛల్ మోహన్ రంగ సినిమా చేసిన కృష్ణ చైతన్య ఈమధ్యనే విశ్వక్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేశాడు. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా పూర్తిస్థాయి సక్సెస్ అందుకోలేదు. మేకర్స్ అది హిట్ సినిమా అని ప్రమోట్ చేసినా సరే ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది అందరికీ తెలిసిందే.
ఇదిలాఉంటే కృష్ణ చైతన్య (Krishna Chaitanya) పవర్ పేట అనే కథ రెడీ చేసుకుని కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. నితిన్ తో సినిమా తెరకెక్కించాలని అనుకుని మధ్యలో ఆగిపోయాడు. ఐతే ఇప్పుడు ఆ సినిమాను విశ్వక్ సేన్ (Viswak Sen) తో చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ టైం లోనే కృష్ణ చైతన్యతో విశ్వక్ మరో సినిమా చేస్తానని అన్నాడట. ఈలోగా తన దగ్గర ఉన్న పవర్ పేట కథ చెప్పడంతో విశ్వక్ దానికి ఓకే అన్నట్టు తెలుస్తుంది.
సో నితిన్ తో చేయాలనుకున్న ఆ ప్రాజెక్ట్ కాస్త విశ్వక్ చేతిలోకి వచ్చింది. మాస్ కా దాస్ ఇమేజ్ తో విశ్వక్ కొత్త ప్రయోగాలతో అదరగొట్టేస్తున్నాడు. విశ్వక్ సేన్ ఏం చేసినా అందులో తన సిన్సియర్ ఎఫర్ట్ కనిపిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) సినిమా కూడా తను ఎన్నో ఆశలు పెట్టుకోగా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి గోదావరి గ్యాంగ్ తో ఫ్లాప్ ఇచ్చినా సరే విశ్వక్ సేన్ మళ్లీ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తూ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. మరి పవర్ పేట (Power Peta) అయినా ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.
విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ ఇంకా లైలా సినిమాలు చేస్తున్నాడు. లైలా కోసం విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటిస్తున్నాడు. మరి విశ్వక్ సేన్ చూస్తుంటే రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించేలా ఉన్నాడు.
