Mokshagna Cinema: నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. టాలీవుడ్ బడా హీరోల్లో బాలకృష్ణ ఒకరు. నందమూరి కుటుంబ వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనకంటూ సెపెరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు మోక్షజ్ఞని సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలనీ అనుకుంటున్నారు.
బాలయ్యతో త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఏర్పడింది. త్రివిక్రమ్ కలిసినప్పుడు బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమా గురించి మాట్లాడుతారట. కథ విషయంలో త్రివిక్రమ్ ఇన్ పుట్స్ తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమే దర్శకత్వం వహిస్తారా..? లేక వేరే డైరెక్టర్ కి అవకాశం ఇస్తారా అని చర్చ మొదలైంది.
తాజాగా పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ తొలి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అంటే.. క్రిష్ అని తెలిసింది. క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. సమ్మర్ కి షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి క్రిష్ మోక్షజ్ఞ మూవీని స్టార్ట్ చేస్తారని వినిపిస్తోంది. బాలయ్య, క్రిష్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేశారు. ఆ కారణంగానే మోక్షజ్ఞను క్రిస్ చేతుల్లో పెడుతున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.
Also Read: Women Fight In Rtc Bus For Seat : భద్రాచలం ఆర్టీసీ బస్సులో మహిళల సిగపట్లు