Site icon HashtagU Telugu

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు పోస్టర్‌లో ఇది గమనించారా.. దర్శకుడు పేరుని తీసేసి..

Krish Jagarlamudi Name Is Removed From Pawan Kalyan Hari Hara Veera Mallu Poster

Krish Jagarlamudi Name Is Removed From Pawan Kalyan Hari Hara Veera Mallu Poster

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ యోధుడిగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2019లో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఈ సినిమాని ఎలాగైనా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ నిర్మాతలు చెబుతున్నారు.

పవన్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. దీంతో మరికొన్ని నెలలు పవన్ సినిమాల నుంచి ఎటువంటి అప్డేట్స్ రావని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సడన్ గా నేడు ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. మే 2న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే రిలీజ్ చేసిన పోస్టర్ లో నిర్మాత పేరు, పవన్ కళ్యాణ్ పేరు తప్ప దర్శకుడు పేరు లేదు. ఇక ఇది గమనించిన కొందరు నెటిజెన్స్ సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేస్తున్నారు.

క్రిష్ పేరుని ఎందుకు తొలిగించారు. ఏమైనా కారణం ఉందా..? అనే సందేహం కలుగుతుంది. క్రిష్ కూడా ప్రస్తుతం ఈ సినిమాని పక్కన పెట్టేసి అనుష్కతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో చిత్రీకరణ విషయంలో వీరమల్లు సెట్స్ లో క్రిష్ తో గొడవలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఆ వార్తలను, క్రిష్ వేరే సినిమాని చేయడం, ఇప్పుడు పోస్టర్ పై పేరు కనిపించకపోవడంతో.. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మూవీ టీం ఈ పోస్టర్ మీద దర్శకుడు పేరు వేయకపోవడానికి రీజన్ ఏంటో తెలియాలంటే వేచి చూడాలి.

Also read : Keerthi Suresh : అక్కడ టాలెంట్ చూపిస్తున్న కీర్తి సురేష్.. మరి ఇంతలా రెచ్చిపోతుంది ఏంటో..?