డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం (Director Krish 2nd Wedding) చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా. ప్రీతి చల్లా (Priti Challa)కు మూడుముళ్లు వేశారు. ఈనెల 16న రిసెప్షన్ ఉండనుంది.. దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ..గమ్యం (Gamyam) సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొని వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరక్కించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహరవీమల్లుపై వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు జ్యోతికృష్ణ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ మరోవైపు అనుష్కా శెట్టితో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నాడు.
క్రిష్ ఇంతకు ముందు రమ్య వెలగ (Ramya )ను పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 7, 2016లో వీరి వివాహం జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల రావడంతో 2018 లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉన్న క్రిష్… ఈ రోజు మళ్లీ వివాహ బంధంలో అడుగు పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా హాస్పిటల్స్ అధినేత్రి, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను వివాహం చేసుకున్నాడు. ”ప్రీతి చల్లా జీవితంలో ఈ రోజు కొత్త అధ్యాయం మొదలైంది. అంతులేని ఆనందం, నవ్వులతో ఆమె జీవితాంతం సుఖః సంతోషాలతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. తన దగ్గరకు వచ్చే పేషేంట్స్ జీవితాల్లో ప్రతి రోజూ ఆవిడ ఏ విధంగా ఆనందాన్ని తీసుకు వస్తారో? ఆ విధంగా ఆమె జీవితంలో సంతోషాన్ని రావాలని ఆశిస్తున్నాం. కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు” అని ప్రీతి చల్లా టీమ్ పేర్కొంది.
Read Also : KTR : ఇప్పుడే ఢిల్లీకి వచ్చా..అప్పుడే హైదరాబాద్‌లో ప్రకంపనలు..