Site icon HashtagU Telugu

Radisson Drugs Case : `ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో క్రిష్‌ పిటిషన్‌

Director Krish

Director Krish

రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంటున్నాయి. గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్‌ హోటల్‌(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్‌ దొరికిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా…పెద్ద డొంకే బయటకు వస్తుంది. ఈ జాబితాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. వారిలో డైరెక్టర్ క్రిష్ కూడా ఒకరు. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ నోటిలీసులు జారీ చేశారు. ఈ క్రమంలో క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. మిగిలిన అనుమానితులు కూడా ముందస్తు బెయిల్‌ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొకైన్‌ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్‌ వివేకానందతో పాటు నిర్భర్, కేదార్, డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానితులుగా ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌తో పాటు చరణ్, సందీప్, లిషీ, శ్వేత, నీల్‌ ఇళ్లకు 160 సీఆర్‌పీసీ నోటీసులు అంటించారు.

We’re now on WhatsApp. Click to Join.

బెంగళూరులో ఉన్న రఘు చరణ్‌ అట్లూరి గురువారం గచి్చబౌలి పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హజరయ్యారు. ఆయనను వైద్య పరీక్షలకు తరలించారు. కాగా, లిషీ సోదరి నటి కుషిత గచి్చబౌలి స్టేషన్‌కు వచ్చి తన సోదరి లిషీ ఇంటికి రావడం లేదని పోలీసులకు తెలిపింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాలని, దీనిపై లిషీకి సమాచారం ఇవ్వాలని పోలీసులు కుషితకు చెప్పినట్టు సమాచారం.

ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టు మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ వెల్లడించారు. అయితే ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న క్రిష్ ను విచారణకు పిలిచిన పోలీసు అధికారులు, ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీస్ విచారణకు రాలేనని, తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. నేడు క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ క్రమంలోనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయించటం అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది.

Read Also : Medaram : మేడారం హుండీల్లో పెద్ద ఎత్తున నకిలీ నోట్లు