Anushka తన లుక్ మార్చుకునే దాకా సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసిన విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరో తో అనుష్క నటించిన ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత నుంచి అనుష్క వరుస సినిమాలు చేస్తుందని అనుకోగా మళ్లీ గ్యాప్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబహ్ర లో ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా క్రిష్ డైరెక్షన్ లో అనుష్క మరో సినిమా సైన్ చేసింది.
క్రిష్ దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టారు. లేడీ ఓరియెంటెడ్ కథలకు అనుష్క పెట్టింది పేరు. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి ఇలా ఆమె చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. అందుకే క్రిష్ కూడా అనుష్కని ఎంపిక చేసుకున్నాడు.
ఆల్రెడీ వేదం సినిమాలో క్రిష్ తో కలిసి పనిచేసిన అనుష్క మరోసారి ఈ సినిమా కోసం పనిచేస్తుంది. ఇక ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఒడిశాలో ఒక అమ్మాయికి జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మూవీ వస్తుందని తెలుస్తుంది. తనకు జరిగిన అన్యాయంపై ఆ అమ్మాయి ఎలా పోరడింది అన్నది ఈ సినిమా కథ అని అంటున్నారు.
పవర్ ఫుల్ కథ.. పవర్ ఫుల్ పాత్ర అయితే అనుష్క అందుకు తగినట్టుగానే పవర్ ఫుల్ గా నటిస్తుంది. తప్పకుండా అనుష్కకి ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచి మైలేజ్ ఇస్తుందని చెప్పొచ్చు.