Site icon HashtagU Telugu

Project K Glimpse: ‘ప్రాజెక్ట్-కే’ నుంచి బిగ్ అప్డేట్.. ఈనెల 21న ఫస్ట్ గ్లింప్స్..!

Project K Glimpse

Resizeimagesize (1280 X 720) 11zon

Project K Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్-కే’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-కే ఫస్ట్ గ్లింప్స్‌ (Project K Glimpse)ను ఈనెల 21వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. గింప్స్‌తో పాటు ప్రాజెక్ట్-కే ఏంటి అన్న విషయాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది.

ఇక ‘ప్రాజెక్ట్ K’ టైటిల్‌ను అమెరికాలోని శాన్ డియాగో COMICCONలో ఆవిష్కరిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌‌ను జూలై 20, 2023న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీని కోసం ఈ సినిమాలో నటిస్తోన్న కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, డైరెక్టర్ నాగ్ అశ్విన్ అమెరికాకు వెళ్లనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను జులై 20న అమెరికాలో, ఇండియాలో జులై 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు కాలచక్ర అనే టైటిల్ ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టైటిల్ కూడా జూలై 20వ తేదీన మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: Sai Dharam Tej : కడపలో సాయి ధరమ్ తేజ్.. రాజకీయాలపై వ్యాఖ్యలు..

ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్ట్-కే’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. ఇప్పటికే దీని మేకింగ్‌ వీడియోస్‌ సోషల్‌ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రాజెక్ట్-కే షూటింగ్‌ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అశ్వీనిదత్ రూ.500 కోట్లు పైగా బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.