Varaha Roopam: కాంతార మూవీ అభిమానులకు గుడ్ న్యూస్.. వరాహరూపం పాటపై నిషేధం ఎత్తివేత..!

‘కాంతార’ సినిమాలోని ‘వరాహరూపం’ పాట అభిమానులకు ఒక శుభవార్త.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 09:15 PM IST

‘కాంతార’ సినిమాలోని ‘వరాహరూపం’ పాట అభిమానులకు ఒక శుభవార్త. తమ ట్యూన్‌ కాపీ చేశారంటూ హోంబలే ఫిల్మ్స్‌పై కేరళలోని తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ వేసిన పిటిషన్‌ను కోజికోడ్ జిల్లా కోర్టు కొట్టివేసింది. పాటపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. కేరళ పాలక్కడ్‌ జిల్లాకోర్టులో కూడా ఒక పిటిషన్‌ దాఖలై ఉంది. దాని తీర్పు తర్వాత ఒరిజినల్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కాంతా బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ మూవీ. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. కాంతార సినిమాకే హైలైట్ వరాహరూపం సాంగ్. ట్రెడిషనల్ టచ్ లో సూపర్బ్ కంపోజిషన్. వరాహరూపం పాటపై గతంలో కేరళ కోర్టు నిషేధం విధించింది. ఆ పాటను వాడొద్దని ఆదేశించింది. మొదట్లో థియేటర్లలో ఆ సాంగ్ ఉన్నా.. ఓటీటీలోకి వచ్చేసరికి ట్యూన్ మార్చేశారు. యూట్యూబ్ లోనూ మార్చేశారు. కొత్త వర్షన్ పాత ట్యూన్ తో సరితూగలేకపోయింది. అయితే తాజాగా వరాహరూపం సాంగ్ పై విధించిన నిషేధాన్ని తొలగించింది కేరళ కోర్టు.

తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళలోని కోజికోడ్ జిల్లా కోర్టు కొట్టివేసింది. తమ ట్యూన్‌ కాపీ చేశారంటూ హోంబాలే ఫిల్మ్స్‌పై కేరళలోని తెయ్యుకుడుం బ్రిడ్జ్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ కోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ‘కాంతార’ చిత్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మ్యూజిక్‌ బ్యాండ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసింది. పాటపై నిషేధం ఎత్తివేసింది.