తెలుగు చిత్రసీమలో అద్భుత నటుడు, నవరస నాట్యమూర్తి కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఇకలేరన్న వార్త అభిమానుల్ని, సినీ ప్రముఖుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కోట చాలామందిని నవ్విస్తాడు.. ఏడిపించగలరు కానీ నవ్వించి, ఏడిపించి, భయపెట్టగలిగిన నటుడు మాత్రం కోటా మాత్రమే”. అల్లరి తాతయ్యగా, పాపులర్ పొలిటిషియన్ గా, క్రూర విలన్ గా ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్రవేశాయి.
Lashkar Bonalu: నేడు ఘనంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. సీఎం రేవంత్ ఏం చేయనున్నారంటే?
కోటా శ్రీనివాసరావు తన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ‘అహ నా పెళ్లంట’, ‘మనీ’, ‘మామగారు’, ‘గణేష్’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి అనేక సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు మరపురాని అనుభూతులు అందించాయి. తండ్రి పాత్రలో చలించినా, అవినీతి నాయకుడిగా ఆగ్రహింపజేసినా, జోకర్ విలన్ గా నవ్వించినా అన్ని కోణాల్లోనూ ఆయన పాత్రలు సినిమాకే ఉమ్మడి ప్రాణంలా ఉండేవి. కోటా శ్రీనివాసరావు అరుదు కాదు కోట్లాదిమందికి అభిమాన నటుడు. ఆయన నటించిన డైలాగులు, నటనలో చూపిన మినిటఎక్స్ప్రెషన్స్ , హావభావాలు ఇప్పటికీ యువతలో మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా “మనకి కావాల్సింది కూడా అదే లేమ్మా.. అదీ పాయింటే!” వంటి డైలాగులు కామెడీ, విమర్శ, సెటైర్లకు మారుపేరుగా మారాయి.
Iga Swiatek: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా స్వైటెక్.. 2017 నుంచి కొత్తవారే ఛాంపియన్స్!
ఇక కోట లేరన్న వార్త ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..ఆదివారం ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు కోటను కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. అలాగే సోషల్ మీడియా లోను కోట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోటా మరణాన్ని వ్యక్తిగతంగా తాను తీవ్రంగా అనుభవిస్తున్నానని ట్విటర్ వేదికగా తెలిపారు. “ప్రాణం ఖరీదు” చిత్రంతో ఇద్దరూ సినీ ప్రయాణం మొదలుపెట్టారని గుర్తు చేస్తూ, “తను చేసిన ప్రతి పాత్రను తను మాత్రమే చేయగలడన్నంత గొప్ప నటుడు. కోటా మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు” అని పేర్కొన్నారు.