తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఇటీవల సినీ పరిశ్రమకు ఈయన పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కోట వయసు 82 ఏళ్లకు చేరుకోవడంతో సినీ కార్యక్రమాల్లో కనిపించటం లేదు. ఈ మధ్యకాలంలో ఎలాంటి వేడుకలకు కూడా హాజరుకాకుండా, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sakshi Office : ఏలూరు లో ‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు
ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh ) కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న అనంతరం, కోటతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘‘కోట బాబాయిని కలవడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఈ ఫోటోలో కనిపించిన కోట గారి చూసిన అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. పూర్తిగా మారిపోయిన ఆయనను కొంతమంది అభిమానులు అస్సలు గుర్తుపట్టలేకపోయారు.
Kia : రక్షణ రంగంలో గేమ్‌చేంజర్.. కియా KMTV వచ్చేసింది..!
కోట శ్రీనివాసరావు జీవితంలో ఆయన పోషించిన విలక్షణ పాత్రలు, డైలాగ్ డెలివరీ, హావభావాలు తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్య కోసం సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. బండ్ల గణేశ్ పంచుకున్న తాజా ఫోటోతో అయినా ఆయన గురించి తెలుసుకునే అవకాశం లభించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.