konidela Susmitha : బాబాయ్ వల్లే మాకు గొడవలు వచ్చేవి – సుష్మిత

బాబాయ్ వల్ల నాకు చరణ్ కు గొడవలు వచ్చేవని ,మా ఇద్దరికీ గొడవ పెట్టి సినిమాను చూసినట్లు చూస్తాడు

Published By: HashtagU Telugu Desk
Sushmita Konidela Pawan Kal

Sushmita Konidela Pawan Kal

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుష్మిత (konidela Susmitha) ..తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. ఇప్పటికే కస్టమ్ డిజెనర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె..నిర్మాత గా రాణించాలని చూస్తుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ నిర్మించి సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు ‘పరువు’ (Paruvu) అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ అందుకున్న సందర్బంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుండడం తో..ఈ ఇంటర్వ్యూ లో బాబాయ్ గురించి చెప్పుకొచ్చి ఆకట్టుకుంది. బాబాయ్ వల్ల నాకు చరణ్ కు గొడవలు వచ్చేవని ,మా ఇద్దరికీ గొడవ పెట్టి సినిమాను చూసినట్లు చూస్తాడు.. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని తెలిపింది. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల మనిషి ఆయన వారికోసం ఏదైన చేస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే క్లింకార ను ఎందుకు చూపించలేదని యాంకర్ అడగ్గా.. తమ పాపను ఇప్పుడే అందరికీ చూపించకూడదని రామ్ చరణ్, ఉపాసన అనుకున్నారు.. వాళ్ల ఇష్టమని సుష్మిత సమాధానం చెప్పింది.

ఇక పరువు వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.

Read Also : Ayyannapatrudu : అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ..?

  Last Updated: 17 Jun 2024, 12:55 PM IST