Site icon HashtagU Telugu

Tollywood Sentiment : ఆ మెగా హీరో నటించడం వల్లే చిరు సినిమాలు ప్లాప్ అవుతున్నాయా..?

konidela pavan tej act chiru movies

konidela pavan tej act chiru movies

చిత్రసీమలో సెంటిమెంట్ (Tollywood Sentiment) లను బాగా నమ్ముతారు. ఆ స్టూడియో లో సినిమా ఓపెనింగ్ జరిగితే సినిమా హిట్టే అని..ఆ హీరోయిన్ నటిస్తే సినిమా హిట్ కొట్టడం గ్యారెంటీ అని..ఆ తేదీలలో సినిమాను రిలీజ్ చేస్తే..తమ ఖాతాలో హిట్ పడ్డట్లే అని ఇలా చాల రకాల సెంటిమెంట్ లను సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భావిస్తారు. అలాగే నెగిటివ్ ఆలోచనలు కూడా కొంతమంది మదిలో ఉంటాయి. ఆ హీరోయిన్ నటిస్తే సినిమా దొబ్బినట్లే అని ..ఆ థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తే సినిమా ప్లాప్ అవ్వడం గ్యారెంటీ అని ఇలా పలు రకాల సెంటిమెంట్ లను కూడా నమ్ముతుంటారు.

తాజాగా చిరంజీవి (Chiranjeevi) సినిమాల ప్లాప్ విషయంలో ఓ సెంటిమెంట్ ను సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ , ఆచార్య , వాల్తేర్ వీరయ్య , రీసెంట్ గా భోళా శంకర్ (Bhola Shankar) మూవీస్ చేసాడు. ఈ నాల్గు సినిమాలలో వాల్తేర్ వీరయ్య మెగా హిట్ అందుకోగా..మిగతా మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ మూడు సినిమాల్లో మరో మెగా హీరో ఉండడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయని సోషల్ మీడియా లో కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ (Konidela Pavan Tej)..ఈ హీరో మాములు సినీ ప్రేక్షకుడికి పెద్దగా తెలియనప్పటికీ , మెగా అభిమానికి మాత్రం ఈ హీరో సుపరిచితమే. పవన్ తేజ్..చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. ఈ హీరో నటించడం వల్లే ఈ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయని కొంతమంది తెగ ట్రోల్ చేస్తున్నారు. పవన్ తేజ్ లెగ్ ఐరెన్ లెగ్ అని , అతడు నటించడం వల్లే చిరు సినిమాలు ప్లాప్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇకనైన ఆ హీరోను తీసుకోకండని చిరంజీవి తో పాటు మిగతా మెగా హీరోలకు సూచిస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సినిమా కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారని..ఖాతాలో దమ్ము ఉంటె అసలు ఆ సినిమాలో హీరో ఎవరు..డైరెక్టర్ ఎవరు అనేది కూడా పట్టించుకోరని అంటున్నారు. మొత్తం మీద పవన్ తేజ్ పేరు ఈ రకంగా వార్తల్లో వైరల్ అవుతుంది.

Read Also : Traffic Police : ట్రాఫిక్ పోలీస్ ను చూడగానే భయంతో లవర్ ను బైక్ ఫై నుండి కిందపడేసిన యువకుడు

Exit mobile version