మంత్రి కొండా సురేఖ (Konda Surekha )పై నటుడు నాగార్జున (Nagarjuna) వేసిన పరువు నష్టం (Defamation Case) దావాపై విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. నాగార్జున వేసిన దావాపై మంత్రి సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. మంత్రి కొండా సురేఖ – అక్కినేని నాగార్జున మధ్య కొనసాగుతున్న పరువు నష్టం కేసు సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంతోముడిపడిన అంశం. మంత్రి కొండా సురేఖ, సమంత – నాగ చైతన్య విడాకుల విషయంలో నాగార్జున ప్రమేయం ఉందని చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సురేఖ మాట్లాడుతూ.. సమంత – నాగ చైతన్య విడాకులకు నాగార్జున కాస్తా కారణమని, ఆయన పాత్ర ఎంతో ఉందని సూచించారు. ఇది సమాజంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఎందుకంటే అక్కినేని కుటుంబం, ముఖ్యంగా నాగార్జున, ఒక గౌరవనీయమైన వ్యక్తి అని అంత భావిస్తారు. ఈ వ్యాఖ్యల తర్వాత నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన ఈ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ, పరువు నష్టం దావా వేశారు.
నాగార్జున చేసిన ఈ పరువు నష్టం దావాలో, ఆయనపై చేసిన ఈ ఆరోపణలు తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పరువును దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసు ఇప్పుడు కోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే పలు వాయిదాలు పడగా..తాజాగా అక్టోబర్ 30కి విచారణను వాయిదా పడింది. ఏరోజైనా దీనిపై తీర్పు వస్తుందా..? లేక మరోసారి వాయిదా పడనుందా..? అనేది చూడాలి.
Read Also : Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి సీట్ల పంపకాలు దాదాపుగా ఖరారయ్యాయి!