Site icon HashtagU Telugu

Geethanjali Malli Vacchindi : రాజకీయాలను సినిమాలకు ముడి పెట్టొద్దు.. ఎంతమంది అడ్డు పడినా సినిమా రిలీజ్ చేస్తాం..!

Good Chance for Anjali Geetanjali Malli Vacchindi Movie

Good Chance for Anjali Geetanjali Malli Vacchindi Movie

Geethanjali Malli Vacchindi అంజలి లీడ్ రోల్ లో సత్య రాజేష్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014 లో వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. 10 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ రావడంపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పడింది.

సినిమా ప్రచార చిత్రాలు కూడా అంచనాలు పెంచేశాయి. అసలైతే మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా విపరీతమైన పోటీ ఉండటం వల్ల ఏప్రిల్ 11కి వాయిదా వేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ టైం లో సినిమా రిలీజ్ ఆపాలని నిర్మాత నట్టి కుమా ఎలక్షన్ కమీషన్ కు లేఖ రాశారు.

ఈ సినిమాను వైసీపీ ఎంపీ ఎం.వి.వి సత్య నారాయణ నిర్మించడమే దీనికి ప్రధాన కారణమని ఆయన లెటర్ లో రాసుకొచ్చారు. అయితే దీనికి ఆన్సర్ సినిమా నిర్మాతల్లో ఒకరైన కోనా వెంకట్ స్పందించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించాం ఈ సినిమాను ఆపాలని నట్టి కుమార్ ఎలక్షన్ కమీషన్ కు లెటర్ రాశారు. సినిమా విషయంలో ఆయన రూల్స్ తెలుసుకుని ఆయన లెటర్ రాసి ఉంటే బాగుండేదని కోనా వెంకట్ అన్నారు.

ఎలక్షన్ కమీషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఈ లెటర్ రాసుంటే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగదు. సినిమాలను రాజకీయాలకు ముడి పెట్టొద్దు అంటూ స్పందించారు. సినిమా ఒక కులానికి, పార్టీకి చెందింది కాదని సినిమా కోసం కొన్ని వందలమంది టెక్నీషియన్లు, కళాకారులు పనిచేస్తారని. ఏప్రిల్ 11న ఎవరు అడ్డొచ్చినా.. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు కోన వెంకట్.

Also Read : NTR : ఇండస్ట్రీకి మరో ఎన్టీఆర్ రాబోతున్నాడు.. నందమూరి ఫ్యామిలీ నుంచి లాంచింగ్ రెడీ..!

Exit mobile version