Site icon HashtagU Telugu

Kona Venkat : ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తానంటున్న రైటర్ కోన వెంకట్

Kona Ntr

Kona Ntr

ఫేమస్ రైటర్లలో కోన వెంకట్(Kona Venkat) ఒకరు..ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు , మాటలు రాసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మరో రచయిత గోపి మోహన్‌తో కలిసి.. శ్రీను వైట్ల సినిమాలకు ట్రాక్స్ రాస్తూ ఉండేవారు. బయట కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రైటర్‌గా పనిచేశారు. ఆపై పొడ్యూసర్‌గానూ మంచి సక్సెస్‌లు అందుకున్నారు. ప్రస్తుతం ‘గీతాంజలి 2’ (Geethanjali 2) తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ అనంతరం మీడియా తో మాట్లాడుతూ..ఎన్టీఆర్ (NTR)ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్టీఆర్ నటించిన సాంబ, అదుర్స్, బాద్‌షా, జై లవకుశ సినిమాలకు కోనవెంకట్ పని చేశారు. వీటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తే.. బాద్‌షా, జై లవకుశ , సాంబ చిత్రాలు యావరేజ్ హిట్స్ అయ్యాయి. ఇక అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ లో ఈ రేంజ్ కామెడీ యాంగిల్ కూడా ఉందా అని దర్శక , నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. చారి పాత్రలో ఎన్టీఆర్ కామెడీ సినిమాకు హైలైట్ గా నిలువడమే కాదు సినిమా సక్సెస్ కు ప్రధాన కారణంగా నిలిచింది. అలాంటి అదుర్స్ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుండని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్నీ కోన చెప్పుకొచ్చారు. అదుర్స్ 2 గురించి మాట్లాడుతూ.. “ఆ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసి అయినా ఎన్టీఆర్ ని ఆ సీక్వెల్ కి ఒప్పిస్తాను” అంటూ కోన వెంకట్ తెలిపారు. మరి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..అదుర్స్ రేంజ్ లో కథను కోన సిద్ధం చేస్తాడా..? అనేది చూడాలి.

Read Also : Egg Dum Biryani: ఎగ్ ధమ్ బిరియాని ఇలా చేస్తే చాలు.. ప్లేట్ ఖాళీ అవ్వడం ఖాయం?