Bollywood Ramayana : హిందీ రామాయణ్ ను రిజెక్ట్ చేసిన కోలీవుడ్ స్టార్..!

Bollywood Ramayana బాలీవుడ్ లో మరో రామాయణం రాబోతున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Published By: HashtagU Telugu Desk
Vijay Sethupathi Telugu Movie News

Vijay Sethupathi Telugu Movie News

Bollywood Ramayana బాలీవుడ్ లో మరో రామాయణం రాబోతున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణాన్ని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు సీత పాత్రలో ఫిక్స్ కాగా కె.జి.ఎఫ్ హీరో యశ్ ని రావణుడిగా ఓకే చేశారు.

సినిమాలో సౌత్ స్టార్స్ ని కూడా తీసుకునే ప్లానింగ్ లో భాగంగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని విభీషణుడి పాత్రకు అడిగారు. అయితే మొదట్లో సినిమా చేసేందుకు ఓకే అన్నట్టుగా చెప్పిన విజయ్ సేతుపతి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయడం కుదరదని చెప్పేశాడట. కోలీవుడ్ లో విలన్ గా మంచి ఫాం లో ఉన్న విజయ్ సేతుపతి బాలీవుడ్ రామాయణం చేసే అవకాశం లేదని చెప్పేశాడట.

విజయ్ సేతుపతికి అనుకున్న విభీషణుడి పాత్రలో హర్మ్నా భవేజాని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రామాయణం పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.

Also Read : Prabhas : ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్.. లక్కీ ఛాన్స్..!

  Last Updated: 11 Mar 2024, 02:00 PM IST