Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో రాబోతున్నాడు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లాక్ చేయగా ఆ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. ఈ సినిమా తర్వాత విడి 12వ సినిమాగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.
ఈ సినిమాలో విజయ్ తో పాటుగా తమిళ స్టార్ హీరో తనయుడు కూడా నటిస్తాడని లేటెస్ట్ న్యూస్. తమిళ స్టార్ చియాన్ విక్రం తనయుడు ధృవ్ కూడా అక్కడ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ ఆదిత్య వర్మ లో అతనే హీరోగా చేశాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాలో ధృవ్ ఒక క్యామియో రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.
సినిమాలో అతని పాత్ర ఉండేది కొద్దిసేపే అయినా సినిమాకు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ధృవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. గౌతం తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబో సినిమాలో ముందు శ్రీలీలని హీరోయిన్ గా అనుకోగా ఆమె ప్లేస్ లో రష్మిక మందన్న వచ్చి చేరిందని టాక్.
Also Read : Allu Arjun : పుష్ప రాజ్ కొత్త లుక్ చూశారా.. కెవ్వు కేక అనేస్తున్న ఫ్యాన్స్..!