Ajith: వారి కోసం ప్రేమతో బిర్యానీ చేస్తున్న హీరో అజిత్.. వీడియో వైరల్?

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 05:52 PM IST

టాలీవుడ్ హీరో అజిత్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. తమిళంలో ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు అప్పుడప్పుడు సోషల్ మీడియా విషయంలో కూడా వార్తలో నిలుస్తూ ఉంటారు అజిత్. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అజిత్ బిర్యాని చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హీరో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అజిత్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టమని అందరికి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా బైక్ టూర్స్ వేస్తూ వస్తుంటారు. తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి ఫారెస్ట్ రైడింగ్ కి వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడమే కాకుండా డిన్నర్ టైములో తన స్నేహితుల కోసం అదిరిపోయే బిర్యానీ ప్రిపేర్ చేశారు. అజిత్ బిర్యానీ చేస్తుంటే పక్కన ఫ్రెండ్స్ ఆ సువాసనతోనే కడుపు నింపుకుంటున్నారు. ఫైనల్లీ అజిత్ ప్రిపేర్ చేసిన బిర్యానీ చూస్తుంటే నెటిజెన్స్ కి కూడా నోరు ఊరుతుంది.

 

ఇకపోతే హీరో అజిత్ సినిమాల విషయానికి వస్తే.. అజిత్ ప్రస్తుతం విడ ముయిర్చి సినిమాలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లబోతుందట. అజర్‌బైజాన్‌ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి మూవీ టీం సిద్దమవుతుందట. ఇక ఈ షూటింగ్ కి వెళ్లేముందు అజిత్ ఫ్రెండ్స్ తో ఇలా ఛిల్ల్ అవుతున్నారు.