Site icon HashtagU Telugu

Good Bad Ugly Movie: అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్‌ అగ్లీ.. తెలుగు టీజర్ రిలీజ్.. మాములుగా లేదుగా!

Good Bad Ugly Movie

Good Bad Ugly Movie

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్క్‌ ఆంటోని ఫేమ్‌ అధిక్‌ రవి చంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో నవీన్‌ ఎర్నేని, వై. రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ ను విడుదల చేసిన మేకర్స్ ఇవాళ తెలుగుతో పాటు హిందీ లోనూ గుడ్‌ బ్యాడ్ అగ్లీ టీజర్‌ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్‌ లో అజిత్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్‌ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

 

కాగా ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ టీ జర్ అన్ని చూసి నా ప్రేక్షకులు అభిమానులు మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అజిత్‌ కుమార్‌ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విదాముయార్చి మూవీతో ప్రేక్షకులను పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో ఈ సినిమా విడుదలైంది. ‍అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో అజిత్ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో నైనా బ్లాక్ బస్టర్‌ కొట్టాలని అజిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.