Site icon HashtagU Telugu

Chiyaan Vikram: ఇన్ స్టాలో 1 వ్యక్తినే ఫాలో అవుతున్న విక్రమ్.. అతడు ఏవరో తెలుసా?

Vikram

Vikram

తమిళ్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) క్రేజ్ గురించి సినిమా ఫ్యాన్స్ కు తెలిసిందే. ఆయన వైవిధ్యమైన సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతాయేమోకానీ.. ఆయన నటన మాత్రం అన్ని వర్గాలకు నచ్చుతుంది. ఏ స్టార్ హీరోకైనా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. విక్రమ్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్ కు ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, విక్రమ్ మాత్రం ఇన్ స్టాలో ఒకరిని మాత్రమే ఫాలో అవుతుండటం క్యూరియాసిటీని పెంచుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్ ను 2 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్న ఈ స్టార్ మాత్రం ఒకరినే ఫాలో కావడం అభిమానులను ఆశ్చర్యపర్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారా? అది మరెవరో కాదు అతని కొడుకు ధృవ్ విక్రమ్. తండ్రి అడుగుజాడల్లోనే ధృవ్ కూడా నటననే కెరీర్‌గా ఎంచుకున్నాడు. స్టార్ కిడ్ 2019లో ఆదిత్య వర్మ అనే రొమాంటిక్ డ్రామాతో తన అరంగేట్రం చేసాడు. 2022లో, తండ్రీ కొడుకులు గ్యాంగ్‌స్టర్ డ్రామా మహాన్‌లో కలిసి నటించారు.

ఇంకా చియాన్ విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి చూస్తే అనేక ఫొటోలు ఆకట్టుకుంటాయి. పొన్నియన్ సెల్వన్ లో నటించిన విక్రమ్ మరో మూవీ కోసం వైవిధ్యమైన పాత్రలో అలరించబోతున్నాడు. సెప్టెంబర్ 2022 నుండి మాత్రమే విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్నాడు.  విక్రమ్ దాదాపు నాలుగు సంవత్సరాల ముందు (జూలై 2018, ఆగస్టు 2022 మధ్య) తన ప్రొఫైల్‌లో ఏమీ పోస్ట్ చేయకపోవడం గమనార్హం.

Also Read: Marriage Rumours: మెగా కుటుంబంలో మోగనున్న పెళ్లి భాజాలు.. త్వరలో వరుణ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌?