తమిళ పరిశ్రమ (Kollywood) సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెలవారుజామున చెన్నైలోని రామాపురంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సినీ అభిమానులు ఢిల్లీ గణేష్ మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.
తమిళ నటుడే అయినా తెలుగు, మలయాళ,, కన్నడ భాషల్లో దాదాపు 400 పైగా సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేష్. కమెడియన్ పాత్రలతో పాటు కొన్ని సినిమాల్లో ప్రతి నాయక చాయలున్న పాత్రలు చేశారు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఢిల్లీ గణేష్ (Dhilli Ganesh) మెప్పించారు.
1976లో సినీ పరిశ్రమలోకి..
ఢిల్లీ గణేష్ 1976లో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సినిమాల్లో నటించడనికి ముందు ఢిల్లీ గణేష్ 1964 నుంచి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. దక్షిణ భారత నాటక సభ ఢిల్లీ అనే థియేటర్ గ్రూప్ సభ్యుడు ఆయన. కె బాలచందర్ (K Balachander) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాతో 1977 లో ఢిల్లీ గణేష్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఢిల్లీ గణేష్ తన కెరీర్ లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ రోల్స్ చేశారు. అపూర్వ సహోదరులు సినిమాలో ఆయన విలన్ గా చేసి ఆడియన్స్ ని అలరించారు. మైఖేల్ మదన కామరాజన్, నాయగన్, సింధు భైరవి. ఆహా, తెనాలి, అవై షణ్ముఖి సినిమాల్లో ఢిల్లీ గణేష్ నటకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలుగు ఆడియన్స్ కు ఢిల్లీ గణేష్ సుపరిచితుడే. తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నారు.
Also Read : Koratala Siva : స్టార్ తనయుడితో కొరటాల శివ భారీ ప్లాన్.. ఎవరు ఊహించని కాంబో..!