Site icon HashtagU Telugu

Bhagavanth Kesari Remake : భగవంత్ కేసరి రీమేక్ పై ఆ ఇద్దరు తమిళ హీరోల మధ్య కొట్లాట..!

Kollywood Heroes Fight For Bhagavanth Kesari Remake

Kollywood Heroes Fight For Bhagavanth Kesari Remake

Bhagavanth Kesari Remake నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటించారు. సినిమాకు థమన్ అందిచిన మ్యూజిక్ కూడా సినిమా సక్సెస్ కు కారణమైంది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఇదిలాఉంటే ఈ సినిమా రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలని కోలీవుడ్ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు.

భగవంత్ కేసరి సినిమా రీమేక్ లో దళపతి విజయ్ నటిస్తాడని ఓ టాక్ ఉంది. విజయ్ పాలిటిక్స్ లో అడుగు పెట్టే ముందు భగవంత్ కేసరి లాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. అయితే విజయ్ తో పాటుగా ఈ సినిమా మీద సూపర్ స్టార్ రజినికాంత్ కన్ను పడిందట. విజయ్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నాడని తెలుసుకున్న రజిని అతను చేయకపోతే తను చేయాలని అనుకుంటున్నాడట.

సో విజయ్, రజిని ఇద్దరిలో ఎవరో ఒకరు భగవంత్ కేసరి సినిమా రీమేక్ చేసే అవకాశం ఉంది. బాలయ్య సినిమాకు తమిళంలో ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటుందని ఊహించలేదు. అయితే రీమేక్ సినిమాను అనీల్ రావిపుడి కాకుండా తమిళ దర్శకులే చేస్తారని తెలుస్తుంది. మొత్తానికి భగవంత్ కేసరి సినిమా కోలీవుడ్ రీమేక్ గా ట్రెండ్ సృష్టిస్తుంది. విజయ్, రజిని ఈ ఇద్దరిలో ఎవరు ఆ సినిమా చేస్తారన్నది చూడాలి.

Also Read : Guntur Karam Digital Release Date : నెలలోపే గుంటూరు కారం కూడా.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..!