Site icon HashtagU Telugu

Dhanush & Aishwarya Together: కొడుకు కోసం ఒక్కటైన కోలీవుడ్ కపుల్

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివర ధనుష్‌ని తొలగించి రజనీకాంత్‌గా మార్చుకుంది. విడిపోయిన తర్వాత వీరిద్దరు కలిసి కనిపించిన దాఖలాలు లేవు. ధనుష్ తన ఇద్దరు కొడుకులతో ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తున్నాడు. విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య మొదటిసారి కలిసి కనిపించారు. మాజీ జంట తమ పెద్ద కొడుకు యాత్రా స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

“ఈరోజు ఎంత గొప్ప ప్రారంభం. స్పోర్ట్స్ కెప్టెన్‌గా నా పెద్ద కొడుకు ఎంపికయ్యాడు అంటూ ఐశ్వర్య సోమవారం ఓ ఫోటోను వదిలింది. అదే సమయంలో, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కుటుంబ చిత్రాన్ని కూడా పంచుకుంది. “అందులో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తారు. ఈ ఫోటో చూసిన అభిమానులు మళ్లీ కలిశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. హిందీలో ‘ఓ సతీ చల్’ అనే ప్రేమకథా చిత్రానికి ఆమె దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version