కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం (Santhanam) లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా వడక్కుపట్టి రామస్వామి. తన మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను కార్తీక్ యోగి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.
We’re now on WhatsApp : Click to Join
ఈ ఈవెంట్ కి కోలీవుడ్ హీరో ఆర్య అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో సంతానం మాట్లాడుతూ ఆర్య నాకు మంచి స్నేహితుడని అన్నారు. మా ఇద్దరిలో ఎవరు కనిపించినా ఒకరి గురించి ఒకరు అడుగుతారని అన్నారు.
ఆర్య నాకు మంచి స్నేహితుడు. తను ఎక్కడ కనిపించినా నా గురించి.. నేను ఎక్కడ కనిపించినా సరే ఆర్య గురించి అడుగుతారు. దీనికి కారణం మా ఇద్దరికీ అప్పులు ఎక్కువ ఉండటమే. వాటి విచారణలో భాగంగానే మా ఇద్దరిలో ఎవరు కనిపించినా ఒకరి గురించి ఒకరు అడుగుతారని అన్నారు సంతానం. అయితే స్టార్ కమెడియన్ అయిన సంతానం కి అప్పులు ఏంటా అని ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.
కమెడియన్ గా సూపర్ ఫాం కొనసాగిస్తున్న సంతానం సడెన్ గా హీరోగా టర్న్ తీసుకున్నాడు. అయితే తనని తాను హీరోగా నిలబెట్టుకునేందుకు సొంత బ్యానర్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు సంతానం. ఈ క్రమంలో ఒకవేళ అప్పులు చేసి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం సంతానం నటించిన వడక్కుపట్టి రామస్వామి సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా సినిమా ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాతో సంతానం మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
Also Read : Tamannah Ready for Marriage : పెళ్లికి రెడీ అవుతున్న తమన్నా.. ఆ టెంపుల్ లో ప్రత్యేక పూజలు అందుకోసమేనా..?