Hari Hara Veera Mallu: ఆకట్టుకుంటున్న హరిహర వీరమల్లు సాంగ్ ప్రోమో.. కొల్లగొట్టినాదిరో అంటూ!

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో వైరల్ గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో పోల్చుకుంటే రాజకీయాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఇకపోతే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే కొన్ని కొంతమేర షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి. వాటిలో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడుతూనే వస్తోంది.

ఈ సినిమా గత ఏడాది ఎలక్షన్స్ కంటే ముందే విడుదల కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టడం రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో రకాల అప్డేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ప్రోమో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరొకసారి ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. అందులో భాగంగానే ఈనెల 24వ తేదీ సాయంత్రం మూడు గంటలకు కొల్లగొట్టినాదిరో అనే సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా తాజాగా ఈ పాట ప్రోమోను విడుదల చేసారు. “కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో ” అంటూ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ సాగే ఈ గీతం అందరినీ అలరించేలా ఉంది. ఈ ప్రోమోలో అనసూయ, పూజిత పొన్నాడ ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పాటను మంగ్లీ, రమ్య బెహర, యామిని ఘంటసాల, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటకు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. అలాగే చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మార్చి 28న ఈ సినిమా పార్ట్‌ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని మీరు కూడా చూసేయండి..

  Last Updated: 21 Feb 2025, 04:22 PM IST