Site icon HashtagU Telugu

Samantha: సమంతను ఎత్తుకున్న అక్షయ్ కుమార్.. ప్రోమో అదుర్స్!

Samantha

Samantha

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ అనగానే.. అందరికీ మొదటగా గుర్తుకువచ్చేది ‘కాఫీ విత్ కరణ్’ షో. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా కరణ్ కు షోకు లెక్కలేని అభిమానులన్నారు. ఆ షో నుంచి కొత్త ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు విడుదలవుతందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ కొత్త ఎపిసోడ్ ట్రైలర్‌ను షేర్ చేశారు. మూడవ ఎపిసోడ్‌లో నటులు అక్షయ్ కుమార్, సమంతా రూత్ ప్రభు సందడి చేశారు.  ట్రైలర్‌లో కరణ్ తన షో గెస్ట్ లను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు.. అక్షయ్ సమంతను ఎత్తుకొని ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపర్చాడు. సమంత పింక్, ఎరుపు రంగు దుస్తుల్లో గ్లామర్ ను ఒలకబోసింది. ఇక అక్షయ్ బ్లూ సూట్ లో ఆకట్టుకున్నాడు. అక్షయ్ భారతదేశంలోని ప్రముఖ, అత్యంత విజయవంతమైన నటులు అని కరణ్ పేర్కొన్నాడు.

విడాకుల గురించి మాట్లాడమని సమంతపై కరణ్ ఒత్తిడి చేయడంతో  “సంతోషం లేని వివాహాలకు కారణం నువ్వే” అని పంచ్ డైలాగ్ వేసింది. తర్వాత ఎపిసోడ్‌లో అక్షయ్ సమంతా కలిసి డాన్స్ చేయడం ప్రతిఒక్కరినీ మెస్మరైజ్ చేసింది. ఇంకా ఈ షోలో సమంత పెళ్లి, విడాకులకు సంబంధించిన విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు. అక్షయ్ కుమార్ కూడా తన పర్సనల్ లైఫ్ గురించి బొలోడు విషయాలను షేర్ చేసుకున్నారు. జూలై  7న డిస్నీ+ హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ప్రసారం ప్రారంభమైంది. ప్రారంభ ఎపిసోడ్‌లో అలియా భట్ రణ్‌వీర్ సింగ్ ఆకట్టుకున్నారు. రెండవ భాగంలో సారా అలీ ఖాన్. జాన్వీ కపూర్ తమ ముచ్చట్లతో షోను రక్తి కట్టించారు. సారా అలీఖాన్ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని చెప్పిన విషయం తెలిసిందే.