Site icon HashtagU Telugu

Reema Sen: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

Mixcollage 16 Feb 2024 09 18 Am 5994

Mixcollage 16 Feb 2024 09 18 Am 5994

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథ నేపథ్యంలో ఎన్నో సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే. అందులో చాలా వరకు సినిమాలు ప్రేక్షకులను అలరించడంతో పాటు ప్రేక్షకుల మనసులను తాకాయి. అటువంటి సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గాని నిలిచింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ సినిమా యువతను ఎక్కువ ఆకర్షించింది. అలాగే ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. వి ఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇప్పటికి ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయితే టీవీలకు అతుక్కుపోయి చూసే వారు ఎంతోమంది ఉన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రీమాసేన్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో ఈమె మనసంతా నువ్వే, అదృష్టం, బావ నచ్చాడు, నీతో వస్తా సినిమాల్లో నటించి మెప్పించింది. తమిళ్‌ లో చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అలాగే హిందీలోనూ మెరిసింది.

 

అయితే కెరీర్ బాగా పిక్స్ లో ఉన్న సమయంలో ఈమె రీమా సేన్ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను 2012 లో వివాహం చేసుకుంది. ఆమె 2013 ఫిబ్రవరి 22న వారి మొదటి బిడ్డ రుద్రవీర్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది రీమాసేన్. అయితే ప్రస్తుతం సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఒక్క క్షణం ఆమెను చూస్తే ఆమె ఎవరు అన్న విషయం గుర్తుపట్టడం చాలా కష్టం. మనమంతా నువ్వే సినిమాకు ఇప్పటికీ చాలా మారిపోయింది రీమాసేన్. ప్రస్తుతం ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఏంటి రీమాసేన్ ఇంతలా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version