Shriya Saran Lip-lock: బహిరంగంగా భర్తకు ముద్దులు.. ట్రోల్స్ పై శ్రియ స్ట్రాంగ్ రియాక్షన్!

ఇటీవల విడుదలైన దృశ్యం 2 చిత్రంలో కనిపించిన నటి శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీ తో కలిసి మరోసారి సందడి చేసింది.

  • Written By:
  • Updated On - November 23, 2022 / 04:18 PM IST

ఇటీవల విడుదలైన దృశ్యం 2 చిత్రంలో కనిపించిన నటి శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీ తో కలిసి మరోసారి సందడి చేసింది. ఓ ఈవెంట్ కు హాజరైన ఈ జంట పబ్లిక్ గానే ముద్దులు (లిప్ లాక్స్) పెట్టుకున్నారు. శ్రియా గతంలోనూ భర్తపై బహిరంగంగానే ముద్దుల వర్షం కురిపించింది. తాజాగా మరోసారి లిప్ లాక్ చేయడంతో నెటిజన్స్ ట్రోల్స్ కు దిగారు. కెమెరా ముందు ప్రతిసారీ ముద్దులు పెడతారు, బయట కూడా ముద్దులు పెట్టుకుంటారు. ప్రతిసారీ బహిరంగంగా ఎందుకు ముద్దులు పెట్టుకోవాలి’’ అని నెటిజన్స్ ఘాటుగా విమర్శించారు.

‘‘ముద్దు అనేది చాలా సాధారణం! ప్రత్యేక క్షణాల్లో ముద్దు పెట్టుకోవడం తప్పేమీ కాదు. నా వరకు ఇదొక అందమైనది. నేను చెత్త కామెంట్లను చదవను. వాటికి స్పందించను. నేను చేయాలనుకున్నదే చేస్తా. నా భర్త కూడా సపోర్ట్ గా ఉంటాడు’’ అని శ్రియ కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. ఈవెంట్ కోసం అటెండ్ అయిన శ్రియ ఎరుపు రంగు చీర, గోల్డ్ ఇయర్ రింగ్స్ ధరించగా, ఆండ్రీ సూట్‌ ధరించి కనిపించారు. వీరుద్దరు పెట్టుకున్న లిప్ వీడియో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది.