Site icon HashtagU Telugu

Lungi Dance: సల్మాన్, రామ్ చరణ్, వెంకీ ‘లుంగీ’ డాన్స్.. ఏంటమ్మా వీడియో సాంగ్ అదుర్స్!

Ram Charan

Ram Charan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేశ్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ka Jaan). ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన బతుకమ్మ సాంగ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ కల్చర్ ను ఎలివేట్ చేసిన ఈ పాంట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా మేకర్స్ మరో పాటను విడుదల చేశారు.

కొద్దిసేపటి క్రితమే ‘ఏంటమ్మా’ (Yentamma) అంటూ సాగే మరో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో వెంకటేష్, సల్మాన్ ఖాన్ లుంగీ గెటప్‌లో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. అయితే చివరలో రామ్ చరణ్ సైతం ఇద్దరు కలిసితో లుండీ డాన్స్ వేసి ఆశ్చర్యపర్చారు. ఇక పూజా హెగ్డే కూడా లుంగీలో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెటింట్లో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అప్‌కమింగ్ ఫిల్మ్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’.  పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక కాగా.. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆట్టుకుంటున్నాయి. ఈ మూవీని ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.