Kiran Rathod: అవకాశాల కోసం వెళితే కమిట్మెంట్ అడుగుతున్నారు: కిరణ్ రాథోడ్

కాస్టింగ్ కౌచ్ అంటే.. నేను నీకు అవకాశం ఇస్తే, నువ్వు నాకేం ఇస్తావు. దీనికి ఎంతో మంది నటీమణులు బలైనవారే. తాజాగా కిరణ్ రాథోడ్ తన జీవితంలో జరిగిన విషయాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టారు.

Kiran Rathod: కాస్టింగ్ కౌచ్.. చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తున్న పేరిది. ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ పై పలువురు నటీమణులు ముందుకొచ్చి పరిశ్రమలో చీకటి ఒప్పందాలను బట్టబయలు చేశారు. ఒక్క అమ్మాయి సినిమా రంగంలో రాణించాలి అంటే నిర్మాత, లేదా దర్శకుడిని ఎంటర్టైన్ చేయాల్సిందేనని మీడియా ముఖంగా సంచలన కామెంట్స్ చేశారు.

కాస్టింగ్ కౌచ్ అంటే.. నేను నీకు అవకాశం ఇస్తే, నువ్వు నాకేం ఇస్తావు. దీనికి ఎంతో మంది నటీమణులు బలైనవారే. తాజాగా కిరణ్ రాథోడ్ తన జీవితంలో జరిగిన విషయాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టారు. తమిళంలో జెమినీ, విలన్, అన్బే శివం, తెన్నవన్, ప్రభుత్వం, విన్నర్, న్యూ వంటి పలు చిత్రాల్లో నటించిన కిరణ్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు.

కిరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. తమిళ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క సినిమాతోనే బిగ్గెస్ట్ స్టార్ అయ్యాను. కొంత కాలం తర్వాత నేను ప్రేమ వివాహం చేసుకున్నాను దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పింది. దాంతో ఆమెకు కొన్ని చెప్పుకోలేని ఆఫర్లు వచ్చాయని తెలిపింది. డబ్బులిస్తం మరి కమిట్మెంట్ ఇస్తారా అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపింది. కొందరు నిర్మాతల్లో డైరెక్ట్ కూడా పడుకుంటావా అని అడిగారట.

సినిమా రంగంలో నాతో మంచిగా ఉండేవాళ్లంతా నన్ను పడుకోమన్నారు. దీంతో నేను కొంత అసంతృప్తికి గురయ్యాను. చాలా మంది నటీమణులు బికినీలు ధరించినప్పుడు పోర్న్ నటిగా ముద్ర వేయడం ప్రారంభిస్తారు. ఓ ప్రముఖ నటుడు నన్ను మోసం చేసిన మాట వాస్తవమే. కానీ నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 2001లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కిరణ్ రాథోడ్ తెలుగులో నువ్వు లేక నేను లేను ,జెమిని ,భాగ్యలక్ష్మి బంపర్ డ్రా వంటి చిత్రాలలో నటించింది.

Also Read: Chiranjeevi: వరుణ్ సినిమాల్లో నాకు నచ్చిన మూవీ అదే.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్?