Kiran Abbavaram Rules Ranjan : ఏడాదిలో నేనేంటో చూపిస్తా..!

కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. Kiran Abbavaram Rules Ranjan ఈవెంట్

Published By: HashtagU Telugu Desk
Kiran Abbavaram Slipper Shot Answer to media Person

Kiran Abbavaram Slipper Shot Answer to media Person

కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమాను ఏ.ఎం రత్నం సమర్పించగా దివ్యాంగ్ లువానియా, మురళి కృష్ణ నిర్మించారు. సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 6న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. Kiran Abbavaram Rules Ranjan ఈవెంట్ కు గెస్ట్ లుగా అంబికా కృష్ణ, దర్శకుడు అనుదీప్ వచ్చారు.

ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం స్పీచ్ అతని ఫ్యాన్స్ ని మెప్పించింది. కెరీర్ లో ఎత్తుపళ్లాలు చూశానని ఈ టైం లో తనతో ఉన్న ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పాడు కిరణ్ అబ్బవరం. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు చేస్తానని మీ అందరిని గర్వపడేలా చేస్తానని అన్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఈ సినిమాకు డైరెక్టర్ రత్నం కృష్ణ ఎంతో ఎఫర్ట్ పెట్టారని సినిమా సక్సెస్ అయితే దానికి కారణం కూడా ఆయనే అని అన్నారు కిరణ్ అబ్బవరం.

సినిమాలో తనతో పాటు నటించిన నటీనటులంతా బాగా చేశారని. తన కెరీర్ లో కంప్లీట్ కామెడీ సినిమా చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు కిరణ్ అబ్బవరం. హైపర్ ఆది చెప్పినట్టుగా సినిమా గురించి మీమ్స్ , ట్రోల్స్, రివ్యూస్ రాసే వారు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమే అని.. సినిమా సక్సెస్ లో వారు కూడా భాగం అవ్వాలని కోరారు. కిరణ్ అబ్బవరం తన అభిమానులకైతే ఏడాదిలో మీరంతా గర్వపడేలా తానేంటో చూపిస్తా అంటూ చెప్పారు.

రూల్స్ రంజన్ (Rules Ranjan) ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా కిరణ్ అబ్బవరం కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. అక్టోబర్ 6న రూల్స్ రంజన్ సినిమా వస్తుంది. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అని చెబుతున్న ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Hyper Aadi : ఏ హీరోని వదిలిపెట్టని హైపర్ ఆది.. ఎన్టీఆర్ నుంచి కిరణ్ వరకు సెన్సేషనల్ కామెంట్స్..!

  Last Updated: 01 Oct 2023, 12:21 PM IST