తెలుగు యువ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ (Rahasya Gorak) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి సినిమా నుంచి వీరి మధ్య రిలేషన్ ఉన్నా ఈమధ్యనే వారి ఎంగేజ్మెంట్ తో విషయాన్ని వెల్లడించారు. ఇక గురువారం సాయంత్రం పెళ్లితో ఒక్కటయ్యారు. కిరభ్ అబ్బవరం, రహస్య మ్యారేజ్ కి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలుగా అయితే సెలబ్రిటీల పెళ్లిల్ల వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడతారు.
కానీ కిరణ్ అబ్బవరం (Kiran Abbaram) పెళ్లి వీడియో మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ముఖ్యంగా రహస్య కి కిరణ్ తాళి కట్టే వీడియో అతను అందరికీ చూపిస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. యువ జంట సినిమాలో నటించి అప్పటి నుంచి ప్రేమలో ఉండి ఫైనల్ గా పెళ్లి (Marriage)తో ఒక్కటయ్యారు.
ఆన్ స్క్రీన్ పై జత కట్టి ఆఫ్ స్క్రీన్ లో వారిద్దరే జీవితాన్ని పంచుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి వస్తున్నాడు. త్వరలో క సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రాయలసీమ నుంచి వచ్చిన కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత ఎస్.ఆర్ కళ్యాణమండపం తో కూడా సక్సెస్ అందుకున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ ఆ తర్వాత వరుస ఫ్లాపులు తీస్తున్నాడు.