కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా కొత్త సినిమా ప్రీ లుక్ పోస్టర్ ఒకటి రిలీజైంది. ఈమధ్య కాలంలో కిరణ్ అబ్బవరం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఐతే ఈసారి కొద్దిగా గ్యాప్ తీసుకుని క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం హీరోగా క (Ka Movie) అనే టైటిల్ తో సినిమా వస్తుంది. శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ లో సుజీత్ అండ్ సందీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
రీసెంట్ గా ప్రీ లుక్ పోస్టర్ వదిలిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్. అంతేకాదు టైం ట్రావెల్ (Time Travel) కథతో సినిమా వస్తుందట. సినిమా కథ కథనాలు అన్నీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. కిరణ్ అబ్బవరం ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.
సినిమాను పాన్ ఇండియా (PAN India) వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క సినిమా టైం ట్రావెల్ సినిమాల్లో డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తుందని తెలుస్తుంది. క సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు కిరణ్ అబ్బవరం. యువ హీరోలు అంతా కూడా సరికొత్త ప్రయోగాలతో సత్తా చాటుతున్న ఈ టైం లో కిరణ్ కూడా తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు.
ఐతే క అసలు ఎలాంటి కథతో వస్తుంది. కిరణ్ క్యారెక్టరైజేషన్ ఏంటన్నది త్వరలో ఫస్ట్ గ్లింప్స్ తో తెలుస్తుని. కిరణ్ మాత్రం ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట. మరి యువ హీరో కంబ్యాక్ మూవీగా క ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. చూస్తుంటే ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి కిరణ్ అబ్బవరం చేరేలా ఉన్నాడు. మరి కిరణ్ ఈ సినిమాతో తను సెట్ చేసుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.