Site icon HashtagU Telugu

Kiran Abbavaram Ka : యువ హీరో పాన్ ఇండియా అటెంప్ట్.. క అంటూ పోస్టర్ తోనే సూపర్ బజ్..!

Kiran Abbavaram Ka Business Theatrical and Non Theatrical Rights

Kiran Abbavaram Ka Business Theatrical and Non Theatrical Rights

యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. ఈమధ్య అతను చేసిన సినిమాలేవి అంతగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. వినరా భాగ్యము విష్ణు కథ తర్వార తీసిన సినిమాలన్నీ కూడా నిరాశపరచాయి. అందుకే ఈసారి కొంత గ్యాప్ తీసుకుని హిట్ టార్గెట్ తో వస్తున్నాడు కిరణ్. హీరో అన్నాక కెరీర్ లో హిట్లు ఫ్లాపులు కామన్ కానీ కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే టైం లో అవి ఇబ్బంది కలిగిస్తాయి.

ఇప్పటికే రాయలసీమ నుంచి వచ్చిన హీరోగా తన డైలాగ్ డెలివరీతో మెప్పిస్తున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) చేస్తున్న ప్రతి సినిమా కొత్తగా ఉండాలని చూస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం క (Ka Movie) అంటూ ఒక సరికొత్త ప్రీ లుక్ పోస్టర్ తో వచ్చాడు. క తో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాను శ్రీచక్ర మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తుండగా సుజిత్ అండ్ సందీప్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై బజ్ పెంచేలా చేశారు. ఐతే ఈ సినిమా టైటిల్ ఒకే ఒక్క అక్షరం పెట్టడం క్రేజీగా ఉంది. అంతేకాదు ఈ సినిమాను పాన్ ఇండియా (PAN India Release) రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. క అంటూ కిరణ్ తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు. ఇన్నాళ్లు మన పక్కింటి అబ్బాయిగా కనిపించిన కిరణ్ ఈ సినిమాతో మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని అర్ధమవుతుంది.

ఆల్రెడీ ఆడియన్స్ లో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు కాబట్టి కిరణ్ అబ్బవరం కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తో నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి. తెలుగు సినిమాలు అన్నీ ఈమధ్య నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తూ సత్తా చాటుతున్నాయి. కిరణ్ అబ్బవరం కూడా కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాడు. సినిమా కూడా కిరణ్ కెరీర్ బెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది.