Site icon HashtagU Telugu

Kiran Abbavaram : దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం ఫస్ట్ పాన్ ఇండియా సినిమా.. కిరణ్ ధైర్యం ఏంటి..?

Kiran Abbavaram Ka Movie Tough Fight in Deepavali

Kiran Abbavaram Ka

Kiran Abbavaram : గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఏకంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ‘క'(KA) అనే సినిమాతో వస్తున్నాడు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో క సినిమా తెరకెక్కుతుండగా నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాని దాదాపు 20 కోట్లతో తెరకెక్కిస్తుండటం, ఫ్లాప్స్ లోఉన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా కూడా మారడం, ఇప్పటికే అన్నిచోట్లా బిజినెస్ అయిపోవడం, క అనే టైటిల్ పెట్టడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే క సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా నేడు క సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.

కిరణ్ అబ్బవరం క సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. తాజాగా నేడు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఎర్పాటు చేసారు. అయితే అదే సమయానికి తెలుగు నుంచి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, సత్యదేవ్ జీబ్రా సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అమరన్, భగీరా రానున్నాయి. బాలీవుడ్ లో సల్మాన్ సినిమా కూడా రానుందని సమాచారం.

దీంతో ఇన్ని సినిమాలు పెట్టుకొని దీపావళికి కిరణ్ అబ్బవరం తన మొదటి పాన్ ఇండియా సినిమా, తాను కూడా నిర్మించిన సినిమా ఎలా రిలీజ్ చేస్తున్నాడో, అతని ధైర్యం ఏంటో అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది. అయితే కిరణ్ అబ్బవరం సన్నిహితుల సమాచారం ప్రకారం సినిమా బాగుందని, ఇప్పటికే సినిమా బిజినెస్ మొత్తం అయిపోయిందని సమాచారం. మరి చూడాలి ఈసారన్నా కిరణ్ ఈ భారీ సినిమాతో హిట్ కొడతాడేమో.

 

Also Read : Game Changer : దీపావళికి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఫిక్స్.. తమన్ ట్వీట్ తో క్లారిటీ..