KA Teaser : మొన్నటివరకు వరుస సినిమాలతో ఆడియన్స్ ని పలకరించిన కిరణ్ అబ్బవరం.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల అప్డేట్స్ కూడా ఇవ్వకుండా, సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇక ఇటీవల తాను చేస్తున్న ‘క’ అనే కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. నేడు ఆ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి అందర్నీ థ్రిల్ చేసారు. శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని విశేషం ఏంటంటే.. ఈ మూవీని ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. సుజీత్ అండ్ సందీప్ ఈ సినిమాని రచించి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. విరూపాక్ష తరహాలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం ఒక అటవీ ప్రాంతంలో పోస్టుమాన్ గా పని చేస్తుంటాడు. అయితే ఆ ఉత్తరాలను ప్రజలకు అందించే ముందు కిరణ్ అబ్బవరం వాటిని దొంగతనంగా చదువుతుంటాడని, అలాగే ఎవరికి తెలియకుండా హత్యలు కూడా చేస్తుంటాడని టీజర్ లో చూపించారు.
టీజర్ చూడడానికి అయితే చాలా ఇంటరెస్టింగ్ గానే ఉంది. చూస్తుంటే కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో బెస్ట్ అండ్ బిగ్ హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.