Site icon HashtagU Telugu

Kiran Abbavaram : హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న రాజావారు

Kiran Eng

Kiran Eng

ప్రస్తుతం చిత్రసీమ (Film Industry )లో నటి నటులంతా వరుసపెట్టి పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచ్లర్ లైఫ్ కు శుభం కార్డు పలుకుతూ..పెళ్లి కార్డు కు వెల్ కం చెపుతున్నారు. రీసెంట్ గా పలువురు హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా..తాజాగా టాలీవుడ్ హీరో & హీరోయిన్ ప్రేమ పెళ్ళికి సిద్ధం అయ్యారు. రాజావారు రాణిగారు (Raja Vaaru Rani Gaaru) సినిమాలో జంటగా నటించిన కిరణ్ అబ్బవరం ..రహస్య గోరక్‌ (Kiran Abbavaram and Rahasya Gorak) లు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వీరి నిశ్చితార్థం (Engagement ) ఈరోజు హైదరాబాద్లో సింపుల్గా జరిగింది.

కేవలం కుటుంబ సభ్యులు..కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ..నేడు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఎంగేజ్‍మెంట్ వేడుకలో కిరణ్ లైట్ పింక్ కలర్ కుర్తా ధరించగా.. పీచ్ కలర్ చీరను రహస్య ధరించింది. ఇద్దరూ చూడముచ్చటగా కనిపించి ఆకట్టుకున్నారు.