Allu Arjun : రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ పని.. ఇప్పుడు తనకి పెద్ద సమస్యగా మారబోతున్నట్లు కనిపిస్తుంది. తమ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో వైసీపీ పై యుద్ధం ప్రకటించారు. ఇక ఈ యుద్ధంలో పవన్ కళ్యాణ్ కి తోడుగా మెగా హీరోలు సైతం తోడుగా నిలబడ్డారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్, వైష్ణవ్ ఇలా మెగా హీరోలతో పాటు వారి లేడీస్ సైతం పవన్ కి మద్దతు తెలుపుతూ పిఠాపురం వెళ్లారు.
తమ కుటుంబం సభ్యుడు కోసం మెగాకుటుంబం అంతా కదిలి వెళ్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం వైసీపీ లీడర్ ఇంటికి వెళ్లి, తనకి మద్దతు తెలపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పవన్‌ని, మెగా కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ వచ్చిన వైసీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. తన సొంత కుటుంబసభ్యుడైనా పవన్ కి మద్దతు తెలుపుతూ చిన్న ట్వీట్ వేసి, తన భార్య స్నేహితుడు భర్తకి మద్దతు తెలపడానికి ఇంటి వరకు వెళ్లడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టీడీపీ కార్యకర్తలు సైతం ఈ విషయానికి తీవ్రగా ఖండించారు.
తాజాగా జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ అల్లు అర్జున్ ని ఏకిపారేస్తూ ప్రశ్నించారు. “పవన్ కళ్యాణ్ ని తిట్టిన వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడం నూరుకి నూరు శాతం తప్పు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మీకు తెలుసు. ఆయన్ని చూస్తూనే మీరు పెరిగారు. అలాంటి వ్యక్తిని తిట్టిన వ్యక్తికీ మీరు ఎందుకు మద్దతు తెలిపారు అనేది తప్పక తెలియజేయాలి. ఒకవేళ మీకు మీకు ఏమైనా ఉంటే అవి మీ ఫ్యామిలీ వరకు చూసుకోవాలి. మా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వ్యక్తికి మీరు మద్దతు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలి” అంటూ అల్లు అర్జున్ ని ప్రశ్నలు వేశారు.
Ayyyooo Nakka Thenguluu pic.twitter.com/LtR5aau8lS
— Raees (@RaeesHere_) June 6, 2024