Site icon HashtagU Telugu

KINGDOM : విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ టీజర్ అదిరిపోయింది

Kingdom Teaser

Kingdom Teaser

కెరియర్ మొదట్లో వరుస హ్యాట్రిక్ విజయాలు సాధించిన విజయదేవరకొండ (Vijay Deverakonda)..ఆ తర్వాత వరుస ప్లాప్స్ తో సతమతవుతున్నారు. ప్రస్తుతం ఆశలన్నీ తన కొత్త మూవీ KINGDOM పైనే పెట్టుకున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను బుధువారం విడుదల చేసి అంచనాలు పెంచారు. టీజర్ ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫై మరింత హైప్ వచ్చింది.

Local Body Elections : తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..?

టీజర్‌లో ఎన్టీఆర్‌… “అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం… వలస పోయినా, అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహారణం… నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు…. ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం ఎవరి కోసం… అసలు ఈ వినాశనం ఎవరి కోసం.. రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాల చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం ” అంటూ చెప్పిన డైలాగ్స్‌ సినిమాకి విపరీతమైన అంచనాలు పెంచింది. ఎన్టీఆర్ డైలాగ్స్‌కి ఏమాత్రం తగ్గకుండా గౌతమ్‌ తిన్ననూరి అద్భుతమైన విజువల్స్‌ను క్రియేట్‌ చేశారు. చివర్లో విజయ్‌ దేవరకొండ.. ఏమైనా చేస్తా సర్‌, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సర్‌ అని చెప్పిన డైలాగ్‌ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. మీరు కూడా టీజర్ పై లుక్ వెయ్యండి.