Site icon HashtagU Telugu

King Of Kotha : దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఎలా ఉందంటే..

King Of Kotha Talk

King Of Kotha Talk

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహానటి , సీతారామం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తన కంటూ తెలుగు లో ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇతర భాషలలో నటించిన మూవీ లు కూడా తెలుగు లో డబ్ అయ్యి , విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి. కనులు కనులను దోచాయంటే, జనతా హోటల్, అందమైన జీవితం, హేయ్ పిల్లగాడ, పిల్ల రాక్షసి మొదలగు డబ్ చిత్రాలు పర్వాలేదు అనిపించాయి.

తాజాగా ‘కింగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha) అంటూ మరో పాన్ ఇండియా మూవీ తో ఈరోజు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అభిలాష్ జోషీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ..రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకుంది. సల్మాన్ నటించిన గత చిత్రం సీతారామం మంచి విజయం సాదించడం తో ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఫై ఆసక్తి పెరిగింది. మరి ఈ ఆసక్తి తగ్గట్లు కథ ఉందా..? సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా..? లేదా అనేది చూద్దాం.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే (King Of Kotha Story)..ఇద్దరు ప్రాణ స్నేహితులు (దుల్కర్ సల్మాన్, షబీర్ ) ఒకే ఊరులో ఉంటూ గంజాయి..విక్రయిస్తూ.. పలు మోసాలు చేస్తుంటారు. ఆ తర్వాత హీరో లైఫ్ లోకి హీరోయిన్ (ఐశ్వర్య లక్ష్మీ) రావడం తో..అప్పటివరకు చేస్తూ వచ్చిన గంజాయి , మోసాలు ఆపేస్తాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఊరు వదిలిపోతాడు..ఆలా వెళ్లిన తర్వాత ఆ ఊరంతా తన స్నేహితుడు ఆధీనంలోకి వెళ్తుంది. ఆలా ఊరంతా సర్వనాశనం అవుతుంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆ ఊరిలోకి హీరో వస్తాడు..ఆ తర్వాత ఆ ఊరుని ఎలా బాగుచేస్తాడు…? తన ప్రాణ స్నేహితుడి ఏంచేస్తాడు..? అసలు ఊరునుండి హీరో వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కథ.

ఫైనల్ (King Of Kotha Final Talk) : కింగ్ ఆఫ్ కొత్త మూవీ చూస్తున్నంత సేపు కొత్త ఫీలింగ్ ఏమి కలగదు. మనం ఇది వరకు ఎన్నో చిత్రాలు చూసిన ఫీలింగే కలుగుతుంది. ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వం, మోసాలు మీద ఎన్నో కథలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహాలోనేది. కాకపోతే.. హీరో హీరోయిన్ ట్రాక్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ లో కూడా 40 ఏళ్ల వ్యక్తి పాత్రలో దుల్కర్ బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకుంటుంది. ఇక డాన్ తరహాలో అతడి హావభావాలు, మ్యానరిజమ్స్ అలరిస్తాయి. దుల్కర్ తర్వాత ఆస్థాయిలో ఆకట్టుకున్న నటుడు “సార్పట్ట” చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్ గా విశేషమైన రీతిలో అలరించిన షబ్బీర్. ఈ చిత్రంలో అతడికి మంచి పాత్ర లభించింది. ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య లేక్ష్మి, ప్రసన్న , గోకుల్ సురేష్, శాంతి కృష్ణ, అనిఖా సురేంద్రన్, నైల ఉష తదితరులు పర్వాలేదు అనిపించారు.

Read Also : Moon from Earth : భూమికి చంద్రుడు దూరం అవుతున్నాడా..? కొన్నేళ్ల తర్వాత అసలు చంద్రుడు కనిపించడా..?

సినిమాటోగ్రఫీ నిమిష్ రవి సినిమాకు ప్లస్ అయ్యింది. సాదాసీదా కథను తన కెమెరా పనితనంతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా.. స్లోమోషన్ షాట్స్ & క్యారెక్టర్ ఇంట్రడక్షన్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం బాగుంది. జేక్స్ బిజోయ్ పాటలు తెలుగులో పెద్దగా వర్కవుటవ్వలేదు. నేపధ్య సంగీతం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇక డైరెక్టర్ అభిలాష్ విషయానికి వస్తే.. ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ సినిమాను కొత్తగా, టెక్నికల్లీ స్ట్రాంగ్ గా చెప్పాలనుకున్నాడు. కానీ టెక్నీకల్ గా కొంత వరకూ సక్సెస్ అయ్యాడు కానీ.. కథకుడిగా మాత్రం తడబడ్డాడు. పాత్రలు మరీ ఎక్కువైపోవడం, కొన్ని పాత్రలకు ప్రారంభంలో ఉన్న రేంజ్.. సెకండాఫ్ కి వచ్చేసరికి లేకపోవడం..రొటీన్ కథ కావడం సినిమాను దెబ్బ తీసింది. ఓవరాల్ గా ‘‘కింగ్ ఆఫ్ పాత’” అనిపించింది.

Exit mobile version