Na Samiranga Worldwide Business : కింగ్ నాగార్జున నా సామిరంగ బిజినెస్ డీటైల్స్ ఇవే.. హిట్టు కొట్టాలంటే ఎంత తీసుకు రావాలంటే..!

Na Samiranga Worldwide Business కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నా సామిరంగ. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 05:02 PM IST

Na Samiranga Worldwide Business కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నా సామిరంగ. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. సినిమాలో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ప్రచార చిత్రాల్లో పక్కా ఫెస్టివల్ మూవీగా నా సామిరంగ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని.

We’re now on WhatsApp : Click to Join

నా సామిరంగ సినిమా మలయాళ సినిమా పోరింజు మరియం జోస్ సినిమా రీమేక్ గా తెరకెక్కించారు. సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తే పక్కా హిట్టే. అలాంటి పొంగల్ రేసులో నాగార్జున నా సామిరంగ అంటూ వస్తున్నాడు. ఈ సినిమా కేవలం 3 అంటే 3 నెలల్లో పూర్తి చేశారు నాగార్జున. ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా నాగార్జున రేంజ్ తెలిసేలా చేస్తుంది. అయితే థియేట్రికల్ బిజినెస్ ని సేఫ్ గానే చేసినట్టు అర్ధమవుతుంది.

నాగార్జున నా సామిరంగ సినిమా ఏపీ తెలంగాణా రెండు రాష్ట్రాల్లో మొత్తం 15.30 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటకతో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కోటి వరకు బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా నా సామిరంగ సినిమా 18.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఏరియాల వారిగా చూస్తే నైజాం లో 5 కోట్లు, సీడెడ్ 2.2 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల బిజినెస్ చేసింది నాగార్జున నా సామిరంగ.

సినిమా హిట్ అనిపించుకోవాలంటే 19 కోట్ల దాకా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కాబట్టి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ మొత్తం కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. సంక్రాంతి అంటే అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా తమ హీరో సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. అందుకే నాగార్జున నా సామిరంగ సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని స్పీడ్ స్పీడ్ గా చేశారు. మరి నాగార్జున నా సామిరంగ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు

నాగార్జున నుంచి సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు హిట్ అందుకున్నాయి. అదే సెంటిమెంట్ తో నా సామిరంగ కూడా వస్తుంది. ప్రమోషన్స్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ఏర్పరచేలా చేశాయి. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.