King Nagarjuna : హమ్మయ్య ఓ టెన్షన్ తీర్చేసిన నాగార్జున..!

ఈ సినిమాలో విలన్ గా కింగ్ నాగార్జునని పెట్టాలనుకున్న మాట వాస్తవమే అట. నాగార్జున అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకున్నాడట కానీ ఎందుకో మళ్లీ ఆలోచనలో పడ్డాడట

Published By: HashtagU Telugu Desk
Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

Huge Expectations on Nagarjuna Role in Coolie Movie

King Nagarjuna కింగ్ నాగార్జున గురించి ఈమధ్య ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగార్జున సూపర్ స్టార్ రజినికాంత్ కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని ఆ వార్తల సారాంశం. నాగార్జున ఏంటి విలన్ గా చేయడం ఏంటని అందరు రకరకాలుగా అనుకున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో రజిని వింటేజ్ లుక్ అదిరిపోతుందని తెలుస్తుంది. ఆంధ్య వచ్చిన గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచాడు డైరెక్టర్ లోకేష్.

ఇక ఈ సినిమాలో విలన్ గా కింగ్ నాగార్జునని పెట్టాలనుకున్న మాట వాస్తవమే అట. నాగార్జున అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని అనుకున్నాడట కానీ ఎందుకో మళ్లీ ఆలోచనలో పడ్డాడట లోకేష్. ఐతే చూచాయగా విలన్ వేషం గురించి నాగార్జున ని అడిగితే ఆయనన్ నిర్మొహమాటంగా నో చెప్పాడట. సో అలా కూలీ నుంచి నాగార్జున వార్తలు వైరల్ అయ్యాయి.

నాగార్జున ఈ ఇయర్ మొదట్లో నా సామిరంగ (Na Samiranga) సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత మరో సోలో సినిమా ప్రకటించలేదు కానీ ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ఐతే ఈ సినిమా తర్వాత రజిని కూలీలో కూడా విలన్ గా చేస్తాడని అనుకుంటుంటే నాగార్జున టీం అలాంటి వార్తలను కొట్టిపారేసింది.

త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) మొదలవుతుండగా ప్రేక్షకులను అలరించే హోస్టింగ్ టాలెంట్ చూపించాలని నాగార్జున సిద్ధం అవుతున్నారు. తప్పకుండా నాగార్జున ఈ సీజన్ 8 ని కూడా సూపర్ హిట్ చేస్తారని చెప్పొచ్చు. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుందని తెలుస్తుంది. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నితోనే నాగ్ మరో సినిమా చేస్తాడని టాక్. మరోపక్క ధనుష్ తో చేస్తున్న కుబేర లో నాగార్జున పొర్షన్ దాదాపు పూర్తైందని తెలుస్తుంది. సో విలన్ గా ఎక్కడ నాగార్జున చేస్తాడని అనుకున్న అక్కినేని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసిందని చెప్పొచ్చు.

  Last Updated: 26 Jul 2024, 06:59 AM IST